ప‌ని పాటా లేక కేటీఆర్ కాళేశ్వరం వెళ్లాడు: ప్రభుత్వ విప్, అద్దంకి ద‌యాక‌ర్

by Ajay Maddhiboyina |

కూలేశ్వరం అయిన కాళేశ్వరం పైన కేటీఆర్ కొత్త క‌థ‌లు చెపుతున్నాడని, ప‌ని పాటా లేక కాళేశ్వరం కేటీఆర్ వెళ్లాడు, అరెస్ట్ చేస్తే సానుభూతి పొందవ‌చ్చన్నదే ఆయన ఆలోచ‌న‌ అని శాసనమండలిలో ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్ ఆరోపించారు.

ప‌ని పాటా లేక కేటీఆర్ కాళేశ్వరం వెళ్లాడు: ప్రభుత్వ విప్, అద్దంకి ద‌యాక‌ర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కూలేశ్వరం అయిన కాళేశ్వరం పైన కేటీఆర్ కొత్త క‌థ‌లు చెపుతున్నాడని, ప‌ని పాటా లేక కాళేశ్వరం కేటీఆర్ వెళ్లాడు, అరెస్ట్ చేస్తే సానుభూతి పొందవ‌చ్చన్నదే ఆయన ఆలోచ‌న‌ అని శాసనమండలిలో ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం వెళ్లకుండా కేటీఆర్ ను ఎవ‌రూ ఆప‌లేదని, ఆపితే క‌న్నెప‌ల్లికి ఎలా వెళ్లాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హ‌యాంలో కాళేశ్వరం ద‌గ్గర‌కు వెళ్లాల‌ని ప్రయ‌త్నించిన వారంద‌రిని అరెస్టు చేశారని, కాంగ్రెస్ తో పాటు ప్రజా సంఘాలు, ప్రతిప‌క్ష పార్టీల‌ను కాళేశ్వరం ద‌గ్గర‌కు వెళ్లనివ్వలేదని మండిపడ్డారు. క‌న్నెప‌ల్లి పంప్ హౌస్ బీఆర్ఎస్ హయాంలో మొత్తం ముగినిపోయిందని, ఆనాడే బాహుబ‌లి మోటార్లు మొత్తం కూలిపోయాయని అద్దంకి దయాకర్ విమర్శించారు. కాళేశ్వరం కూలిన రోజు మీరెందుకు స్పందించ‌లేదు? కాళేశ్వరం కూలిపోతే కల్వకుంట్ల కుటుంబం క‌నీసం బాధ‌ప‌డ‌లేదని ఆయన ధ్వజమెత్తారు. ల‌క్ష కోట్ల ఖ‌ర్చు పెట్టి క‌మిష‌న్ల కోసం ఎలాంటి స్కెచ్ లు వేశారో అంద‌రికి తెలుసని, కూలిపోయిన కాళేశ్వర ప్రాజెక్టు నుంచి కింద‌కు పోతున్న నీళ్ల చూసి ఇలాంటి ప్రాజెక్టును ఎందుకు క‌ట్టామ‌ని మీరు బాధ‌ప‌డాలని అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ఏం కుట్ర చేయ‌డానికి క‌న్నెప‌ల్లి వెళ్లాడు..? బీఆర్ఎస్ హ‌యాంలో కాళేశ్వరం కూలిపోతే ఎవ‌రో బాంబులు పెట్టి పేల్చార‌ని చెప్పుకున్న చ‌రిత్ర మీదని ఆయన మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలకు పాల్పడిన దొంగలే నీతులు మాట్లాడుతున్నారు : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, చనగాని దయాకర్

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలకు పాల్పడిన దొంగలే నీతులు మాట్లాడుతున్నారని, కేటీఆర్ తెలంగాణ ప్రజలకు ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంకు ఏ మొఖం పెట్టుకొని కేటీఆర్ వెళ్తున్నారని ఆయన నిలదీశారు. మీ నిర్వాకం వల్లనే తెలంగాణ రాష్టం అప్పుల కుప్పగా మారిందని, 8 లక్షల కోట్ల అప్పులకు ఆద్యులు మీరు కదా అని చనగాని దయాకర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మరొక సారి కర్రుకాల్చి వాత పెట్టాలని, ఆ పార్టీ నేతలకి కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించే అర్హత లేదని ఆయన మండిపడ్డారు.

Next Story