ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే..

by Kodari Anjali |

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే..
X

దిశ, తిమ్మాజీపేట: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మరికల్ గ్రామంలో భార్గవి శేఖర్ ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేతో పాటు మండల నాయకులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కొత్త ఇంటిలో కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కులం, మతం, వర్గం, రాజకీయ అనుబంధం చూడకుండా అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తున్నామని అన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా వేలాది కుటుంబాలకు శాశ్వత గృహ భద్రత కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామ్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాగది మల్లయ్య గౌడ్, షేక్ ముబారక్ కొత్త కేశవులు మండల నాయకులు నాగసాయిలు, అబ్దుల్ రావుఫ్, మాజీ సర్పంచ్ నర్సింహా యాదవ్, లింగం, రాంమోహన్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Next Story