- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు మూడు కొత్త ఎయిర్‌పోర్టులు.. స్పీడ్ పెంచిన ప్రభుత్వం
రాష్ట్రంలో ఏవియేషన్ రంగాన్ని విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ముమ్మరం చేశాయి. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఏవియేషన్ రంగాన్ని విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ముమ్మరం చేశాయి. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు సైతం అనుమతి లభించడంతో డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. తాజాగా కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కోసం స్థలాల పరీశీలన పూర్తి చేసి దానికి సంబంధించిన నివేదికను కేంద్రానికి పంపిచారు. అయితే ఇప్పటికే వరంగల్ మూమునూరులో విమానాశ్రయాన్ని నిజాంమర్ ఉస్మాన్ అలీఖాన్ 1930లో నిర్మించారు. స్వాతంత్య్రానికి పూర్వమే అతిపెద్ద విమానాశ్రయంగా ఈ ఎయిర్ పోర్ట్ సేవలు అందించింది.
ఇప్పుడు దీనిని తిరిగి పునరుద్దరిస్తున్నారు. రెండున్నరేళ్లలో ఈ ఎయిర్ పోర్ట్ పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆదిలాబాద్ లో నిర్మించబోయే ఎయిర్ పోర్ట్ ను డిఫెన్స్ మరియు సివిల్ ఏవియేషన్ శాఖలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొత్తం 1,500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లో ట్రైనింగ్ సెంటర్‌తో పాటు పౌర విమాన సేవలు అందుబాటులో రానున్నాయి. కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ ను సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మూడు ఎయిర్ పోర్ట్ లు పూర్తైతే ఏవియేషన్ లోనూ తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు దక్కనుంది.






