- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హస్తాల్‌పూర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ వైర్ల చోరీ కలకలం
by Taduka Kalyani |
వెల్దుర్తి మండలం హస్సాల్పూర్ గ్రామ శివారులో శనివారం రాత్రి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్‌ను దొంగలు చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెల్దుర్తి: వెల్దుర్తి మండలం హస్సాల్పూర్ గ్రామ శివారులో శనివారం రాత్రి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్‌ను దొంగలు చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ సాగు కోసం విద్యుత్ శాఖ అధికారులు గ్రామంలో 5 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఇదే అవకాశంగా భావించిన దొంగలు, ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేసి అందులోని కాపర్ వైర్‌ను దోచుకెళ్లినట్లు సమాచారం. సుమారు రూ.50 వేల విలువైన కాపర్ వైర్ చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామ రైతులు తమ వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
Next Story






