కేజీబీవీ సిబ్బందికి వేతనాలు పెంచాలి: రాష్ట్ర అధ్యక్షురాలు

by Kodari Anjali |

రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీలలో పనిచేస్తున్న వేలాదిమంది వర్కర్లు, నాన్ టీచింగ్ సిబ్బందికి చట్ట ప్రకారం వేతనాలు పెంచాలని టియూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేజీబీవీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ఎల్. పద్మ డిమాండ్ చేశారు.

కేజీబీవీ సిబ్బందికి వేతనాలు పెంచాలి: రాష్ట్ర అధ్యక్షురాలు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీలలో పనిచేస్తున్న వేలాదిమంది వర్కర్లు, నాన్ టీచింగ్ సిబ్బందికి చట్ట ప్రకారం వేతనాలు పెంచాలని టియూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేజీబీవీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ఎల్. పద్మ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక టిఎన్జీఓ సంఘ భవనంలో కేజీబీవీ జిల్లా అధ్యక్షురాలు అరుణ అద్యక్షతన నిర్వహించిన జిల్లా జనరల్ బాడీ మీటింగ్ కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి కొందరికి వేతనాలను పెంచారని, వాటిని కేజీబీవీ ల సిబ్బందికి వర్తింప జేయకపోవడం శోచనీయమని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎస్పీడీ, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి 15 సార్లు, ఒకసారి ముఖ్యమంత్రికి విన్నతీ పత్రాలను సమర్పించినా స్పందన లేదని ఆమె వాపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేసి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణమ్మ, అరుణ్ కుమార్, సాంబశివుడు పాల్గొని మాట్లాడగా, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Next Story