- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదపు అంచుల్లో ప్రచార బోర్డులు
by Ratna Kumari |
కామారెడ్డిలో పలు వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులు ఈదురుగాలులకు దెబ్బతిని ప్రమాదకరంగా వేలాడుతుండటంతో వాహనదారులు, ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.

X
దిశ, కామారెడ్డి : కామారెడ్డిలో పలు వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులు ఈదురుగాలులకు దెబ్బతిని ప్రమాదకరంగా వేలాడుతుండటంతో వాహనదారులు, ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల ప్రభావంతో కామారెడ్డి బైపాస్ రోడ్డులోని సిరిసిల్ల–కామారెడ్డి రహదారి బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన ఓ భారీ ప్రచార బోర్డు తెగిపోయి ప్రమాదకర స్థితిలో వేలాడుతోంది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వారు ఎప్పుడు బోర్డు కిందపడుతుందోనన్న భయంతో ప్రయాణిస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న బోర్డులను తొలగించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న ప్రచార బోర్డులను తొలగించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
Next Story






