హైదరాబాద్‌ను వణికిస్తోన్న చలిగాలులు.. మూడురోజులు ఈ జిల్లాల్లో వర్షాలు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్‌ను వణికిస్తోన్న చలిగాలులు.. మూడురోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కుమరం భీం అసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే బలమైన ఉపరితల గాలులు 50 నుండి 60 కి.మీ వేగంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీచే అవకాశం ఉంది.

వర్షపాతం నమోదైన ప్రాంతాలు

కుమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 4 సెం.మీ, వాంకిడిలో 4 సెం.మీ, దహేగాన్ లో 3 సెం.మీ, కామారెడ్డి జిల్లా గాంధారిలో 3 సెం.మీ, కామారెడ్డిలో 3 సెం.మీ, మచ్చారెడ్డిలో 2 సెం.మీ, రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ లో 2 సెం.మీ, తాడ్వాయిలో 2 సెం.మీ, కుమరం భీం జిల్లా బెజ్జూరులో 2 సెం.మీ, కామారెడ్డి జిల్లా దోమకొండలో 2 సెం.మీ, మద్నూర్ లో 2 సెం.మీ, బిక్నూర్ లో 2 సెం.మీ, మెదక్ జిల్లా నర్సాపూర్ లో 2 సెం.మీ, సంగారెడ్డి జిల్లా హత్నూరలో 2 సెం.మీ, చొప్పున వర్షపాతం నమోదైంది.

Next Story