పేద ప్రజలకు గూడు కల్పించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు

by Kodari Anjali |

దేవుని తిర్మాలాపూర్ లో ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభోత్సవం చేశారు.

పేద ప్రజలకు గూడు కల్పించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు
X

దిశ, పెద్ద కొత్తపల్లి: పేద ప్రజల సంక్షేమం, గూడులేని అర్హత ఉన్న నిరుపేదలకు పక్క ఇళ్లు నిర్మించి నీడ వసతి కల్పించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర అబ్కారీ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం పెద్ద కొత్తపల్లి మండలం దేవుని తిర్మాలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశం చేసిన అనంతరం మంత్రి లబ్ధిదారులకు ప్రభుత్వ కానుకగా నూతన పట్టు వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఎక్కువగా అప్పులు చేయకుండా కట్టుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ ప్రజా ప్రతినిధులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని మంత్రి జూపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పీ సూర్య ప్రతాప్ గౌడ్ పెద్దకొత్తపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి సత్యం, సర్పంచ్ లు బారీ వాములు, మాజీ సర్పంచ్లు పగడాల చిన్నయ్య, మాజీ ఎంపిటిసిలు పుట్ట ఆంజనేయులు, డి రవికుమార్, వెన్నచర్ల గ్రామ ఉప సర్పంచ్ బై రాముడు, గృహ నిర్మాణ సంస్థ ఏ ఈ రాజేందర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ కృష్ణయ్య, కాంగ్రెస్ నాయకులు బొల్లె విష్ణు, వెంకటయ్య, నరేందర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story