మహారాష్ట్రలో భారీ వర్షాలు, 13 మంది మృతి

by Ajay Maddhiboyina |

మ‌హారాష్ట్రలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు 13 మంది మ‌ర‌ణించారు. ముంబైలోనే ఐదు రోజుల్లో ఐదుగురు మృతి చెందారు. ముంబైలో శ‌నివారం కురిసిన వ‌ర్షానికి ప‌లు ప్రాంతాల్లో 100మిల్లీలీట‌ర్ల వ‌ర్షాపాతం న‌మోదైంది.

మహారాష్ట్రలో భారీ వర్షాలు, 13 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: మ‌హారాష్ట్రలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు 13 మంది మ‌ర‌ణించారు. ముంబైలోనే ఐదు రోజుల్లో ఐదుగురు మృతి చెందారు. ముంబైలో శ‌నివారం కురిసిన వ‌ర్షానికి ప‌లు ప్రాంతాల్లో 100మిల్లీలీట‌ర్ల వ‌ర్షాపాతం న‌మోదైంది. వ‌ర్షపు నీరురోడ్డ‌పైకి రావ‌డంతో చెరువుల‌ను త‌ల‌పించ‌గా వాహ‌న‌దారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్ లో చిక్కుకుపోయి అవ‌స్త‌లు ప‌డ్డారు. అంధేరి స‌బ్ వే చెరువును త‌ల‌పిస్తోంది. ఇక‌ మ‌రోసారి రాష్ట్రానికి వ‌ర్షసూచ‌న ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు తెలిపారు.

అంతే కాకుండా ముంబై, థానే, రాయ్ గ‌ఢ్, పాల్ఘ‌ర్ జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ చేశారు. ముంబైలో ప‌లు విమాన స‌ర్వీసులు ర‌ద్దు చేశారు. నాలుగు ఇండిగో విమాన‌సర్వీసుల‌తో పాటు, ముంబై ఎయిర్ పోర్ట్ కు వ‌చ్చే 13 విమానాలు దారి మ‌ళ్లించారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా మ‌హాన‌గ‌రంలోని పాఠ‌శాల‌లకు, కాలేజీల‌కు మ‌ధ్యాహ్నం సెల‌వు ప్ర‌క‌టించాల‌ని ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఆదేశించింది. వ‌ర్షాల‌తో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతుండ‌టంతో విప‌త్తు నిర్వ‌హ‌ణ అధికారులు ఎప్ప‌టికప్పుడు ప‌రిస్థితిని ప‌రిశీలిస్తూ స‌హాయ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

Next Story