- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి: పద్మా దేవేందర్ రెడ్డి
by Taduka Kalyani |
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధితో పాటు రైతులకు సంక్షేమ ఫలాలు అందాయని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.

X
దిశ, నిజాంపేట: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధితో పాటు రైతులకు సంక్షేమ ఫలాలు అందాయని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. నిజాంపేట మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ గేరిగె అనూష భర్త నర్సింలుతో పాటు పార్టీ కార్యకర్త పంపరి శంకరయ్యను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని, రైతులు సుభిక్షంగా ఉన్నారని, వివిధ సంక్షేమ పథకాల ద్వారా రైతులకు ప్రయోజనాలు అందాయని పేర్కొన్నారు. నిజాంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మంజూరైనప్పటికీ, ప్రస్తుత ఎమ్మెల్యే దానిపై తగిన శ్రద్ధ చూపడం లేదని ఆమె ఆరోపించారు. స్థానిక ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆమె కోరారు.
Next Story






