లింగాలలో ప్రత్యేక వాహనాల తనిఖీలు.. 8 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

by Kodari Anjali |

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబటిపల్లి–యాపట్ల ప్రధాన రహదారిపై లింగాల ఎస్‌ఐ ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహించారు.

లింగాలలో ప్రత్యేక వాహనాల తనిఖీలు.. 8 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
X

దిశ, లింగాల: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబటిపల్లి–యాపట్ల ప్రధాన రహదారిపై ఆదివారం లింగాల ఎస్‌ఐ ఎం. చంద్రకాంత్ ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై బ్రెత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించిన 8 మంది వాహనదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి, వారి వాహనాలను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఎం. చంద్రకాంత్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి చర్యలు వాహనదారులతో పాటు అమాయక ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story