- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబుధాబి బిగ్ లాటరీలో భారత మహిళకు జాక్ పాట్..
అబుదాబి బిగ్ టికెట్ డ్రా లో భారతీయ మహిళ జాక్ పాట్ కొట్టింది. ఈ డ్రా లో 25 మిలియన్ దిర్హామ్స్ అంటే భారత కరెన్సీలో రూ.64.9 కోట్లు గెలుచుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: అబుధాబి బిగ్ టికెట్ డ్రా లో భారతీయ మహిళ జాక్ పాట్ కొట్టింది. ఈ డ్రా లో 25 మిలియన్ దిర్హామ్స్ అంటే భారత కరెన్సీలో రూ.64.9 కోట్లు గెలుచుకుంది. ఢిల్లీకి చెందిన 42 ఏళ్ల కనికా అరోరా యూఏఈ రాజధాని అబుధాబీలో ప్రతినెలా నిర్వహించే బిగ్ టికెట్ లో ఈ అదృష్టాన్ని పొందింది. ప్రైజ్ మనీ గెలుచుకున్న మహిళ ఈ విషయంపై సంభ్రమాశ్చర్యాలను వ్యక్తం చేసింది. తొలుత ఈ విషయం తెలియగానే ఏం జరిగిందో తెలియక నిర్ఘాంతపోయానని, మాటలు కూడా రాలేదని తెలిపింది. ఆ తర్వాత నిజంగానే తాను ఇంతపెద్దమొత్తం ప్రెజ్ మనీ గెలిచానని కన్ఫర్మ్ చేసుకున్నాక తన ఆనందానికి అవధుల్లేవని పేర్కొంది. ఇంతపెద్ద మొత్తం నగదు బహుమతి వస్తే ఏం చేయాలన్నదానిపై గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నామని, నిజంగానే అది జరిగేసరికి ఆ డబ్బును వాడటం ఎక్కడ మొదలుపెట్టాలో తెలియడంలేదన్నారు.
బిగ్ లాటరీలో తనకు వచ్చిన ప్రైజ్ మనీతో కొత్త ఇల్లు కొనాలని, మిగతా డబ్బులో కొంతభాగాన్ని తన కుటుంబం కోసం ఖర్చుచేయాలని భావిస్తున్నట్లు కనికా తెలిపింది. కాగా.. గతంలో ఒక భారతీయ షాప్ మేనేజర్ బిగ్ టికెట్ డ్రా లో 20 మిలియన్ దిర్హామ్స్ ను గెలుచుకున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో అత్యంత ప్రాచుర్యం పొందిన మంత్లీ రాఫెల్స్ (నెలవారీ లాటరీలు) లో 'బిగ్ టికెట్' ఒకటి. 1992లో ప్రారంభమైన ఈ లాటరీ మొదటి బహుమతి అప్పట్లో 1 మిలియన్ దిర్హామ్‌లుగా ఉండేది. ఈ బిగ్ టికెట్ మిలియనీర్ డ్రాలో పాల్గొనడానికి టికెట్ ధర Dh500 (దిర్హామ్‌లు) గా ఉంది. ఈ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా లేదా జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Zayed International Airport), అల్ ఐన్ విమానాశ్రయం (Al Ain Airport) లోని కౌంటర్ల వద్ద కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు.






