సర్ స్పెషల్ క్యాంపు ఏర్పాటు అభినందనీయం

by Taduka Kalyani |

ఓటరు జాబితా సవరణలో భాగంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సర్ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయమని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు.

సర్ స్పెషల్ క్యాంపు ఏర్పాటు అభినందనీయం
X

దిశ, సంగారెడ్డి : ఓటరు జాబితా సవరణలో భాగంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సర్ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయమని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. పట్టణంలో 24, 26వ వార్డుల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్ ఆధ్వర్యంలో సర్ ప్రక్రియలో ప్రజలకు సహాయం చేసేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని నిర్మల సందర్శించారు. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ క్యాంప్ లో 1500కు పైగా ఓటర్లకు మ్యాపింగ్ తో ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్ ప్రక్రియ పైన, మ్యాపింగ్ ఎలా చేయాలో తెలియని వారి కోసం ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేసి సహాయం చేయడం అభినందనీయం అన్నారు. ఈ క్యాంప్ ఏర్పాటు చేసిన సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్ ను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఎల్వో లతో పాటు మహమ్మద్ కుతుబుద్దిన్, షేక్ రఫీ, మాజీ కౌన్సిలర్ ఖాజా, జహీర్, అజ్జు, ఆబెద్, హుజేఫా, జాహెద్, అడ్డూ, ఇఫ్తేకర్, రవుఫ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story