- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భేదాభిప్రాయాలు ఉంటే టీపీసీసీ, రాష్ట్ర పార్టీ ఇంచార్జీ దృష్టికి తీసుకెళ్లండి : మల్లు రవి
కాంగ్రెస్ పార్టీలో భేదాభిప్రాయాలు ఉంటే టీపీసీసీ, రాష్ట్ర పార్టీ ఇంచార్జీ దృష్టికి తీసుకెళ్లాలని, టీవీలో మాట్లాడితే సుమోటాగా తీసుకొని చర్యలు తీసుకుంటామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు.

- పత్రికల్లో, మీడియాలో మాట్లాడితే చర్యలు తీసుకుంటాం
- కత్తి వెంకటస్వామి తన వ్యాఖ్యలపైన వివరణ ఇచ్చారు .. ఎన్ఐఆర్ సెల్ అమరేందర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో భేదాభిప్రాయాలు ఉంటే టీపీసీసీ, రాష్ట్ర పార్టీ ఇంచార్జీ దృష్టికి తీసుకెళ్లాలని, అంతేగాని పేపర్ లో కానీ, టీవీలో మాట్లాడితే సుమోటాగా తీసుకొని చర్యలు తీసుకుంటామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తామే అధికారంలోకి వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇలాంటి సమయాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా కలిసి ప్రతిపక్షాలపై విరుచుకపడాలని, ప్రభుత్వంపై చేసే అబద్ధాలను తిప్పికొట్టాలని ఆయన సూచించారు. ఆదివారం గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఇటీవల పార్టీపైన వివాదస్పద వ్యాఖ్యలు చేశారంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామికి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనితో పాటుగా కమిటీకి వచ్చిన ఫిర్యాదుల పైన కమిటీ సమావేశంలో చర్చించింది. అనంతరం కమిటీ చైర్మన్ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ కత్తి వెంకటస్వామి పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక వాఖ్యలు చేశారని కంప్లైంట్ పై విచారణ చేశామని, ఆయన అలా మాట్లాడలేదని వివరణ ఇచ్చారన్నారు. ఎన్ఐఆర్ సెల్ అమరేందర్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని ఎమ్మెల్యే వంశీ కృష్ణ కంప్లైంట్ ఇచ్చారని, ఆయనకి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఆర్ఎస్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ సీఎస్ఎస్ ( కాంగ్రెస్ స్వయం సేవక్ సంఘం) గొప్పదని, ఆర్ఎస్ఎస్ కేవలం జాతీయవాదం గురించి చెప్తుందని, కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్రం కోసమే పుట్టిన పార్టీ అని మల్లు రవి అన్నారు. అయోధ్య రామమందిరంలో జరిగిన సంఘటన ప్రజలు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చిందని, మోదీ నాయకత్వంలో వేసిన కమిటీ సభ్యులు ఇందులో ఉన్నారని ఆయన ఆరోపించారు. బీజేపీకి మొన్న జరిగినవే చివరి ఎన్నికలని మల్లు రవి అన్నారు.






