పెద్దగడ్డ వాగు ఉధృతి .. 20 గ్రామాలకు రాకపోకల బంద్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-05 13:30:11  IST  )

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీగా వర్షం కురిసింది..

పెద్దగడ్డ వాగు ఉధృతి .. 20 గ్రామాలకు రాకపోకల బంద్
X

దిశ, వెబ్ డెస్క్: వాయవ్య బంగాళాఖాతం(Northwest Bay of Benga)లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ(Alluri Sitarama Raju District Paderu Agency)లో భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దగడ్డ వాగు ఒక్కసారిగా ఉధృతి పెరిగింది. ఈ వాగు నుంచి వరద నీరు రోడ్లపై పారుతోంది. ఈ మేరకు 20 గ్రామాల రాకపోకలు బంద్ అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనరాకపోకలు బంద్ కావడంతో ఆయా గ్రామాలకు నిత్యావసరాలు సైతం నిలిచిపోయాయి.

జీవనం అస్తవ్యస్తం

దీంతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. మరో రెండు రోజుల పాటు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే వర్షం కొనసాగిస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహాయచర్యలు ముమ్మరం అందించాలని స్థానికులు కోరుతున్నారు. అటు అధికార యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో సహాయచర్యలు అందిస్తోంది. పునరావాస ఏర్పాట్లు చేసింది. వర్షాలు తగ్గే వరకూ అలర్ట్‌గా అధికారులు సూచించారు. రైతులు పొలాలకు వెళ్లే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు.

Next Story