ఫెన్సింగ్ వైర్లలో చిక్కుకున్న జింకకు ప్రాణదానం

by Taduka Kalyani |

వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం ఎన్కేపల్లి గ్రామ పరిధిలో వ్యవసాయ పొలానికి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ వైర్లలో చిక్కుకున్న ఓ జింకను గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు సకాలంలో స్పందించి సురక్షితంగా రక్షించారు.

ఫెన్సింగ్ వైర్లలో చిక్కుకున్న జింకకు ప్రాణదానం
X

దిశ, మోమిన్‌పేట్: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం ఎన్కేపల్లి గ్రామ పరిధిలో వ్యవసాయ పొలానికి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ వైర్లలో చిక్కుకున్న ఓ జింకను గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు సకాలంలో స్పందించి సురక్షితంగా రక్షించారు. గ్రామ శివారులోని ఓ వ్యవసాయ చేనుకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌లో జింక కాలు చిక్కుకుని బయటపడలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అటుగా వెళ్తున్న స్థానికులు దానిని గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అత్యంత జాగ్రత్తగా ఫెన్సింగ్ వైర్ల నుంచి జింకను బయటకు తీశారు. అనంతరం ప్రాథమిక చికిత్స అందించి, తదుపరి వైద్య పరీక్షలు, సంరక్షణ కోసం అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు.

Next Story