- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు హతం
by Ajay Maddhiboyina |
జమ్మూకాశ్మీర్‌లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. షోపియాన్ జిల్లాలోని చన్ పోరా ప్రాంతంలో మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు జాకీర్ అహ్మద్ గనాయ్, లతీఫ్ భట్ ఉన్నారని సమాచారం రావడంతో అక్కడకు చేరుకున్న భద్రతా దళాలు ఇదరిని మట్టుపెట్టాయి.

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్‌లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. షోపియాన్ జిల్లాలోని చన్ పోరా ప్రాంతంలో మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు జాకీర్ అహ్మద్ గనాయ్, లతీఫ్ భట్ ఉన్నారని సమాచారం రావడంతో అక్కడకు చేరుకున్న భద్రతా దళాలు ఇదరిని మట్టుపెట్టాయి. మరణించినవారిలో జాకీర్ అహ్మద్ గనాయ్ పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక సూత్రధారిగా ఉన్నాడు. దీంతో ఈ ఎన్కౌంటర్ ను పెద్ద విజయంగా భద్రతా దళాలు భావిస్తున్నాయి. చనిపోయిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ను సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో ఉగ్రవాదులను అంతం చేయడంతో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Next Story






