పేదోడి సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం

by Ratna Kumari |

పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు.

పేదోడి సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం
X

దిశ, ఇల్లెందు : పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఇల్లెందు మండలం బాలాజీనగర్ గ్రామపంచాయతీకి చెందిన గుగులోత్ నిర్మల నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆదివారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి రిబ్బన్ కత్తిరించి గృహప్రవేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో సొంతింటి కోసం ఎదురు చూసిన పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆశలను నెరవేరుస్తోందన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి పేద కుటుంబం అభివృద్ధి చెందేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మండల రాంమహేష్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పులి సైదులు, సర్పంచుల సంఘం మండల గౌరవ అధ్యక్షురాలు, బాలాజీనగర్ సర్పంచ్ పాయం స్వాతి, సర్పంచులు వల్లాల మంగమ్మ, పాయం లలిత, నాయకులు పాయం కృష్ణప్రసాద్, కాకటి భార్గవ్, బండి ఆనంద్, దండుగుల శివతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story