- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి సాగు పై పోలీస్ శాఖ నజర్..!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో గంజాయి మొక్కల సాగు ఆందోళనకు గురి చేసింది.

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో గంజాయి మొక్కల సాగు ఆందోళనకు గురి చేసింది. జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా గంజాయి వ్యాపారుల వలలో పడి అమాయక ఆదివాసీ గిరి బిడ్డలు పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తూ పట్టుబడి జైలు పాలవుతున్నారు. గతేడాది 57 కేసుల్లో 101 మందిని అరెస్టు చేసిన పోలీసులు సుమారు 1.70 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో గతంలో పట్టుబడిన గంజాయిను దృష్టిలో ఉంచుకుని, ఈ సారి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. గంజాయి సాగు నిర్మూలనే లక్ష్యంగా ముందస్తు చర్యలు చేపట్టారు. ఖరీఫ్ సీజన్ సాగు నేపథ్యంలో గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న పంట పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మరోవైపు గంజాయి సాగు చేస్తే రైతుల ప్రభుత్వం పథకాలు కట్ చేస్తామని జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరించారు. ఇందులో భాగంగానే గంజాయి సాగు చేస్తూ పట్టుబడిన జిల్లాలోని 35 మంది రైతుల.. రైతు భరోసా నిలిపివేస్తున్నట్లు ఇటీవల అధికారుల సమావేశంలో ప్రకటించారు.
గంజాయి వ్యాపారుల ఉచ్చులో పడి..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలు ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దును అనుకోని ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఉండే గిరిజనులు మహారాష్ట్ర ప్రాంతంలోని వారితో బంధువులు. ఇతర సత్సంబంధాలు ఎక్కువగా ఉండటంతో పాటు అక్కడి వ్యాపారులతో పరిచయాలతో రైతులు గంజాయి సాగు ఉచ్చులో పడినట్టు తెలుస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశతో ఆదివాసీ గిరిజనులు తమ పత్తి కంది పంట పొలాలలో అంతర్గత పంటగా గంజాయి సాగు చేస్తున్నారు. పంటల్లో గుట్టు చప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయిని వివిధ మార్గాల ద్వారా మహారాష్ట్ర తరలిస్తున్నట్లు సమాచారం. ఏజెన్సీ ప్రాంతాలలో పోలీసు సోదాలు చేపట్టడంతో గంజాయి సాగుతో పట్టుబడిన ఆదివాసి గిరిజన బిడ్డలు జైల్ పాల్ అవుతుండగా.. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నారు.
నిర్మూలనకు ప్రత్యేక చర్యలు.
ఖరీఫ్ సీజన్ సాగు నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలైన జైనూర్. కెరమెరి. లింగాపూర్. సిర్పూర్ యు. మండలాలతో పాటు గంజాయి అధికంగా సాగు. విక్రయాలు చేసే గ్రామాల్లో పై ఈ సారి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా గంజాయి నిర్మూలనే లక్ష్యంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సెర్చ్ టీం లను ఏర్పాటు చేసి. సోదాలు చేపట్టడం తో పాటు డ్రోన్ సహాయంతో గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను పోలిసులు గుర్తించనున్నారు.
గంజాయి సాగు చేస్తే కఠిన చర్య తీసుకుంటాం : జిల్లా ఎస్పీ నితిక పంత్.
గంజాయి సాగు. విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ నికిత పంత్ హెచ్చరించారు. గంజాయి లాంటి మత్తు పదార్ధాలతో యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లాలో గంజాయి సాగు నిర్మూలనకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.






