- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిమ్మాపూర్‌లో అడిషనల్ కలెక్టర్ పర్యటన
by Batti.Sumithra |
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఆదివారం అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి పలు గ్రామాల్లో పర్యటించారు.

X
దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఆదివారం అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి పలు గ్రామాల్లో పర్యటించారు. ముందుగా రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన బ్యాంకు పరీక్షను ఆయన పరిశీలించారు. అనంతరం రామకృష్ణ కాలనీలో ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓలకు పలు సూచనలు చేసి, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. తదనంతరం రామకృష్ణ కాలనీలోని ఇంటిగ్రేటెడ్ గోదాములను పరిశీలించిన ఆయన, తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డిని గోదాముల నిర్వహణ, నిల్వ సామర్థ్యం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో రెవెన్యూ శాఖ సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.
Next Story






