ప్రజా పోరాటాలతోనే పేదల సమస్యలకు పరిష్కారం

by Ratna Kumari |

ప్రజా పోరాటాల ద్వారానే పేద ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు.

ప్రజా పోరాటాలతోనే పేదల సమస్యలకు పరిష్కారం
X

దిశ, మర్రిగూడ : ప్రజా పోరాటాల ద్వారానే పేద ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం మండలంలోని కుదబాక్షిపల్లి గ్రామంలో ఎర్రజాల సుజాత అధ్యక్షతన నిర్వహించిన సీపీఐ గ్రామ శాఖ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన ప్రజా పోరాటాల ఫలితంగానే అనేక ప్రజా సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు. పార్టీ నాయకులు గ్రామాల్లో నిబద్ధతతో పనిచేస్తే ప్రజల ఆదరణ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఈదుల బిక్షం రెడ్డి, మండల కన్వీనర్ బుర్ర శేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story