- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ స్టేట్ కన్వీనర్ పి. తేజ డిమాండ్ చేశారు.

దిశ, రాంనగర్: విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ నీట్ సియుఈటి లాంటి అనేక పరీక్ష పేపర్ల లీకులకు కారణమవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి అని అదేవిధంగా విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ స్టేట్ కన్వీనర్ పి. తేజ డిమాండ్ చేశారు. హైదరాబాద్, చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీలో ఆదివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తేజ మాట్లాడుతూ, దేశంలో పరీక్ష పేపర్ల లీకుల అనేవి విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయని, దీనిపై అనేక విద్యార్థి, యువజన సంఘాలు పొలిటికల్ పార్టీలు ఉద్యమిస్తున్నప్పటికీ కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం దారుణమని ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఈ విషయమై నిరసన తెలియజేస్తూ హంగర్ స్ట్రైక్ కూడా చేస్తుందన్నారు. బిజెపి ప్రభుత్వం దేశాన్ని ఫాసిజంలోకి తీసుకెళ్తుందని విమర్శించారు. రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా, నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపుతూ ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐడివైఓ నాయకులు గంగాజీ, జానీగౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






