నవవధువు అనుమానాస్పద మృతి.. బిల్డింగ్ పైనుంచి తోసి చంపేశారా?

by Gantepaka Srikanth |

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివాహమైన రెండు నెలలకే ఓ నవవధువు భవనం పైనుంచి కిందపడి మృతి చెందింది.

నవవధువు అనుమానాస్పద మృతి.. బిల్డింగ్ పైనుంచి తోసి చంపేశారా?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివాహమైన రెండు నెలలకే ఓ నవవధువు భవనం పైనుంచి కిందపడి మృతి చెందింది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, ఆమెను భర్త, అత్తమామలే దారుణంగా హత్య చేశారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళే.. ఢిల్లీలోని పుష్ప్ విహార్‌కు చెందిన 28 ఏళ్ల ఆకృతి (Aakriti) అనే యువతికి ఈ ఏడాది ఏప్రిల్ 24న వివాహమైంది. పెళ్లయిన నాటి నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు ఆమెను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తూ వచ్చారని బాధితురాలి తరపు వారు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆమె భవనం పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కుటుంబ సభ్యుల ఆగ్రహం..

ఆకృతి మరణ వార్త విన్న ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వరకట్న వేధింపుల వల్లే తమ కుమార్తెను బిల్డింగ్ పైనుంచి తోసి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని. ఇది ఆత్మహత్యా? ప్రమాదమా? లేక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా హత్యనా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story