భారత్‌కు బిగ్ షాక్.. గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో వెనకబడిన దేశం

by Ajay Maddhiboyina |

భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. గ్లోబల్ పాస్ పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ 2026లో 200 దేశాలలో 125వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాకింగ్ దేశంలో పౌరులు ఎంత స్వేచ్ఛగా ప్రయాణించగలరు, పెట్టుబడి, జీవన నాణ్యత, దేశం ఎంత ఆకర్షణీయంగా ఉంది అనే కొన్ని అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు.

భారత్‌కు బిగ్ షాక్.. గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో వెనకబడిన దేశం
X

దిశ, వెబ్ డెస్క్: భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. గ్లోబల్ పాస్ పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ 2026లో 200 దేశాలలో 125వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాకింగ్ దేశంలో పౌరులు ఎంత స్వేచ్ఛగా ప్రయాణించగలరు, పెట్టుబడి, జీవన నాణ్యత, దేశం ఎంత ఆకర్షణీయంగా ఉంది అనే కొన్ని అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. గ్లోబల్ పాస్ పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ లో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే 125వ స్థానం దక్కగా, మొబిలిటీలో 135వ స్థానంలో నిలిచింది. అదే విధంగా జీవ‌న నాణ్య‌త‌లో118వ స్థానంలో నిలిచింది. దీని ఆధారంగా అనేక రంగాల‌లో భార‌త్ పురోగ‌తి సాధించిన‌ప్ప‌టికీ అనేక ఇత‌ర దేశాల‌తో పోలిస్తే పాస్ పోర్ట్ ఇప్ప‌టికీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిమిత ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. గ్లోబల్ పాస్ పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ పది దేశాలలో తొమ్మిది యూరప్ దేశాలే ఉన్నాయి. నంబర్ వన్ స్థానంలో స్వీడన్ ఉండగా తరవాత స్థానాల్లో వరుసగా స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, జర్మనీ, డెన్మార్క్ (ఉమ్మడి), నెదర్లాండ్స్ (ఉమ్మడి), ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, నార్వే, సింగపూర్ దేశాలు ఉన్నాయి.

Next Story