అతి తక్కువ సమయంలో బ్రిడ్జి పనులు పూర్తి

by Taduka Kalyani |

ఉట్నూర్ మండలంలోని పులిమడుగు బ్రిడ్జిను అతి తక్కువ సమయంలో నూతన బ్రిడ్జ్ పనులు చేపట్టి పూర్తి చేశారు.

అతి తక్కువ సమయంలో బ్రిడ్జి పనులు పూర్తి
X

దిశ, ఉట్నూర్ : ఉట్నూర్ మండలంలోని పులిమడుగు బ్రిడ్జిను అతి తక్కువ సమయంలో నూతన బ్రిడ్జ్ పనులు చేపట్టి పూర్తి చేశారు. ఆదివారం ఈ బ్రిడ్జి ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పులిమడుగు వంతెన ఇరుకుగా, శిథిలావస్థకు చేరుకోవడంతో నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని, ప్రభుత్వం నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులకు సుమారుగా 4కోట్ల వరకు నిధులు విడుదల చేసి కేవలం రెండున్నర నెలల రోజుల్లోనే పూర్తి నాణ్యతతో బ్రిడ్జి పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకరావడం పట్ల కాంట్రాక్టర్ కు అభినందనలు అని పేర్కొన్నారు. అదే విధంగా గుడిహత్నూర్ నుంచి ఉట్నూర్ వరకు రెండు వరుసల దారి, ఇంద్రవెల్లి, ఉట్నూర్ పట్టణాల్లో సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో సీఎం కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంట్రాక్టర్ ముంతాజ్, అధికారులు, పులిమడుగు గ్రామ ప్రజలు ఉన్నారు.

Next Story