- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అణుశక్తి ఉద్యోగుల సేవలు అభినందనీయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం గౌతమినగర్‌లోని తరంగిణి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన **నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంప్లాయీస్ (ఎన్‌ఎఫ్‌ఏఈఈ) 8వ అఖిల భారత మహాసభ**కు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

దిశ, అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం గౌతమినగర్‌లోని తరంగిణి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన **నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంప్లాయీస్ (ఎన్‌ఎఫ్‌ఏఈఈ) 8వ అఖిల భారత మహాసభ**కు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో అణుశక్తి రంగ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎన్‌ఎఫ్‌ఏఈఈ సేవలను అభినందించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న ఈ సంస్థ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
అలాగే అశ్వాపురంలోని హెవీ వాటర్ ప్లాంట్‌కు సంబంధించిన స్థానిక సమస్యలను, స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరాన్ని ఎంపీ పోరిక బలరాం నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ.. హెవీ వాటర్ ప్లాంట్‌కు సంబంధించిన స్థానిక సమస్యలను కేంద్ర ప్రభుత్వం, సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం, స్థానిక ప్రజల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.
సమావేశానికి ఆహ్వాన సంఘం కన్వీనర్ కురపాటి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. కామ్రేడ్ గడ్డం రమేష్ అధ్యక్షత వహించగా, ఎం.ఎస్. వెంకటేశన్, గంటసాల శ్రీనివాస్, డాక్టర్ మర్రి రాఘవయ్య, కె.వి. జయరాజ్, ఎ. శ్రీధరన్, ఎస్.ఎ. జలీల్, ఎం.కె. బోసు, ఎ. అజీజ్, సింగు నరసింహారావు, పలడుగు భాస్కర్ తదితర కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






