- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చింతకానిలో ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలా..?
ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో తరచూ చోటుచేసుకుంటున్న విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో తరచూ చోటుచేసుకుంటున్న విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. విద్యుత్ కోతలపై సంబంధిత అధికారులను సంప్రదించిన పలువురికి, విద్యుత్ శాఖ ఏఈ నుంచి నిర్లక్ష్యపూరిత సమాధానం వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి నుంచి ఇటువంటి స్పందన రావడంపై మండల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ అంతరాయాలు కొంతవరకు సహజమైనప్పటికీ, నిర్వహణ పనులు లేదా ఇతర కారణాలతో విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వచ్చినప్పుడు ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వడం విద్యుత్ శాఖ బాధ్యత అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను సత్వరమే పరిష్కరించడంతో పాటు, విద్యుత్ కోతలకు గల కారణాలను పారదర్శకంగా వెల్లడించాలని వారు కోరుతున్నారు. అలాగే, ఇకపై ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.






