- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీసీ రోడ్లు, భవన నిర్మాణాలకు నిధుల మంజూరు : మానుక సత్యం
గత కొంతకాలంగా అభివృద్ధిలో వెనుకబడిన గ్రామాలకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సంఘ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మానుక సత్యం తెలిపారు.

దిశ, కోనరావుపేట : గత కొంతకాలంగా అభివృద్ధిలో వెనుకబడిన గ్రామాలకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సంఘ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మానుక సత్యం తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, మహిళా సంఘ భవనాల నిర్మాణానికి శనివారం నిధులు మంజూరుకాగా, ఆదివారం నాగారం గ్రామంలో మానుక సత్యం ఆధ్వర్యంలో సంబంధిత ప్రొసీడింగ్స్‌ను ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులకు అందజేశారు.
నాగారం గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు, మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు, కోనరావుపేట గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.17 లక్షలు, మల్కాపేట గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.1.50 లక్షలు, మర్థనపేట గ్రామంలో 15 సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని సత్యం తెలిపారు. మొత్తం నాలుగు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు కలిపి రూ.63.50 లక్షలు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ఆయా గ్రామాల ప్రజల తరఫున మండల అధ్యక్షులు మానుక సత్యం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కాశీరం, నాగభూషణం, దేవరాజు, దీపిక, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చేపూరి గంగాధర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, గొట్టే రుక్మిణి, కరెడ్ల రమేష్ రెడ్డి, రాస రవి, గోపాల్, లింబయ్య, కుంట శ్రీనివాస్, కార్తీక్, జి. శంకర్, సత్యం, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.






