- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: హోంమంత్రి అనిత
విశాఖకు చెందిన 9 మంది మత్య్యకారులు బోటులో చేపట వేటకు వెళ్లి ఒడిశా పూరీ సముద్ర జలాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే వారిని ప్రాణాలతో సురక్షితంగా స్వగ్రామాలకు చేర్చాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. దీంతో ప్రభుత్వం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Viakha)కు చెందిన 9 మంది మత్య్యకారులు(Fishermen) బోటులో చేపట వేటకు వెళ్లి ఒడిశా పూరీ సముద్ర జలాల్లో(Odisha Puri Sea Waters) చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే వారిని ప్రాణాలతో సురక్షితంగా స్వగ్రామాలకు చేర్చాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. దీంతో ప్రభుత్వం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఫోన్లు స్విచ్ఛాప్ రావడంతో ఆందోళన చెందుతున్నారు.
స్పందించిన హోంమంత్రి
ఈ నేపథ్యంలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. నేవీ, కోస్టల్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మత్స్యకారుల ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్ననాయుడు(Atchennaidu), కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas)తో ఫోన్ ద్వారా మాట్లాడారు. సముద్రంలో గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. గల్లంతైన ప్రతి ఒక్కరినీ సురక్షితంగా తీరానికి చేర్చేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత(Home Minsiter Anitha) ఆదేశించారు. బాధిత మత్స్యకార కుటుంబాలతోనూ హోంమంత్రి వీడియో కాల్‌లో స్వయంగా మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అందుతున్న సహాయాన్ని వివరించారు. తమ వారిని సురక్షితంగా ఇంటికి తీసుకువస్తామని ధైర్యం చెప్పారు.
సహాయక చర్యలు ముమ్మరం
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ గల్లంతైన మత్య్సకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్, నౌకాదళం, స్థానిక యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేశాయని తెలిపారు. ప్రతికూల వాతావరణం ఉన్నా గాలింపు బృందాలు రంగంలోకి దిగాయని అనిత చెప్పారు.






