- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలు తప్పనిసరిగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి : ఎంపీ
ప్రస్తుత తరుణంలో మహిళలు తప్పనిసరిగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు.

దిశ, నర్సాపూర్: ప్రస్తుత తరుణంలో మహిళలు తప్పనిసరిగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. ఆదివారం నర్సాపూర్ లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తప్పనిసరిగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో మహిళలు అధికంగా బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్ కు గురవుతూ ముందుగా గుర్తించక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. క్యాన్సర్ పై అవగాహన ద్వారా క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించినట్లయితే క్యాన్సర్ అనే మహమ్మారిని ఓడించవచ్చని అన్నారు.
మహిళలు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తన కూతురు వైద్యురాలైనందున తన పార్లమెంట్ పరిధిలోని మండలాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వైద్య శిబిరాలు శిశిర ఆసుపత్రి సౌజన్యంతో నర్సాపూర్ లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం నాడు ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరాన్ని నిర్వహించి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నర్సాపూర్ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవనేని సింధు, మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాప గారి రమేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి సంఘసాని సురేష్, ఎండోమెంట్ రాష్ట్ర కన్వీనర్ కవితా రెడ్డి, సీనియర్ నాయకులు పాప గారి పెద్ద రమేష్ గౌడ్, కౌన్సిలర్లు శ్రీకాంత్, నిరంజన్ దాస్, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు రాములు నాయక్, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, నాయకులు బాదే బాలరాజ్, బోర్ వెల్ రాంరెడ్డి, సంఘసాని రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.






