- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొల్లూరు లక్ష్మీపురం ప్లాట్ల సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి.
రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు లక్ష్మీపురం ప్లాట్ల యజమానుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

దిశ,రామచంద్రాపురం : రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు లక్ష్మీపురం ప్లాట్ల యజమానుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం కొల్లూరులో లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984వ సంవత్సరంలో కొల్లూరు పరిధిలోని సర్వే నంబర్ 173 నుంచి 190 పరిధిలోగల 142 ఎకరాలలో భవిష్యత్తు అవసరాల కోసం 1500 ల మంది వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. తదనంతరం కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలతో తిరిగి ప్లాట్లను అమ్మడంతో పాటు. ఇబ్బందులకు గురి చేయడం అన్యాయం అన్నారు. బిఎల్ ప్రసాద్ అనే ప్లాట్ యజమాని సభ్యులందరినీ మోసం చేసి ఫోర్జరీ సంతకాలతో ప్లాట్లను కబ్జా చేసి హెచ్ఎండిఏ అనుమతులతో నిర్మాణాలు కొనసాగించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ తో పాటు, సిటీ ప్లానర్, హెచ్ఎండిఏ ఉన్నత అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లి అనుమతిని రద్దు చేయించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.






