- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రామాయణ’లో నాది చిన్న పాత్ర అయినప్పటికీ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభవం: కాజల్
తాము ఇప్పటివరకు రామాయణ మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్‌ను మాత్రమే పూర్తి చేశామని కాజల్ వెల్లడించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్మాత్మక చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో రాబోతుండగా.. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. అయితే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ రావణాసుడురి భార్య మండోదరి పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తన పాత్ర నిడివి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటివరకు రామాయణ మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్‌ను మాత్రమే పూర్తి చేశామని కాజల్ వెల్లడించారు. ఈ సినిమాలో తన మండోదరి పాత్రకు సంబంధించిన లంక సన్నివేశాలు చాలా తక్కువగా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.
కథ ప్రకారం మొదటి భాగంలో లంకకు సంబంధించిన సీన్లు తక్కువగా ఉండటం వల్ల, సహజంగానే తన పాత్ర నిడివి కూడా తక్కువగానే ఉంటుందని కాజల్ చెప్పారు. స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ, ఇంతటి భారీ మరియు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో రావణాసురుడిగా నటిస్తున్న కన్నడ సూపర్ స్టార్ యష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక గొప్ప అనుభవమని కాజల్ కొనియాడారు. యష్ అద్భుతమైన నటుడని, ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. తన వృత్తి పట్ల యష్‌కు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ చూసి ముచ్చటేసిందని కాజల్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు.






