- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టండి : డిప్యూటీ సీఎం భట్టి
రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

- అర్హత కలిగిన ప్రతి ఓటూ నమోదయ్యేలా చూడాలి
- సంక్షేమ పథకాలు, ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లండి
- సికింద్రాబాద్ కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం
దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాభవన్ లో ఆదివారం జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల కీలక సమావేశానికి హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిలతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఓటరు జాబితాలో అన్-మ్యాపింగ్ పేర్లు, సాంకేతిక లోపాలు, స్పెల్లింగ్ తప్పులు లేకుండా బి.ఎల్.ఏలతో కలిసి డివిజన్ స్థాయి నాయకులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా మినహాయింపు కాకుండా పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ సాయం, నేరుగా విద్యార్థుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ, ఇందిరమ్మ జీవిత బీమా వంటి పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రచారం చేయాలన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 40వేల కోట్లతో చేపడుతున్న రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణాల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. గత పదేళ్ల భయానక వాతావరణాన్ని తొలగించి, ఫోన్ ట్యాపింగ్ భయం లేని స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య పాలనను అందిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. పార్టీ గెలుపు బూత్ స్థాయి నుంచే మొదలవ్వాలని, ప్రజల చిన్న చిన్న సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో అన్-మ్యాపింగ్ పేర్లు 50 శాతానికి పైగా ఉండటం ఆందోళనకరమని, లాజికల్ డిస్క్రిపెన్సీ వల్ల పేర్లు తొలగిపోకుండా సకాలంలో బి.ఎల్.ఓలకు ధృవీకరణ పత్రాలు అందించి సమన్వయం చేసుకోవాలని సూచించారు. నగరంలో జరుగుతున్న ఉపాధి, అభివృద్ధి ప్రణాళికలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఖురేషి, నేతలు కోట నీలిమ, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.






