- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మో.. జూలై
ప్రతి సంవత్సరం జూలై నెల వస్తుందంటే... భద్రాచలం రెవిన్యూ డివిజన్ లోని గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ జీవిస్తారు.

దిశ భద్రాచలం : ప్రతి సంవత్సరం జూలై నెల వస్తుందంటే... భద్రాచలం రెవిన్యూ డివిజన్ లోని గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ జీవిస్తారు. ఏ సమయంలో గోదావరి ముంచుకువస్తుందో అని భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతారు. ముఖ్యంగా 2022 జూలై 16 న భద్రాచలంలో వచ్చిన 71.3 అడుగుల గోదావరి, ఈ ప్రాంతాన్ని ముంచెత్తిన ఘటన గోదావరి పరివాహక ప్రజలు ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు. మన రాష్ట్రంలో కంటే... ఎగువ రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా గతంలో కంటే గోదావరి ఉధృతి మరింత పెరుగుతుంది. గత సంవత్సరం నెల రోజులకు పైగా మొదటి, రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో నిలిచిపోయింది. 2022 జూలై 16న భద్రాచలం వద్ద గోదావరి 71.3 అడుగులకు చేరుకోగా, 2023 జూలై 30 న 51.6 అడుగులు, 2024 జూలై 27 న 53.6 అడుగులు మేర గోదావరికి వరద ఉధృతి రావడంతో, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ కార్యాలయంలో గోదావరి వరదలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇంకా రూ.150 కోట్లు నిధులు కావాలి
భద్రాచలం శివారు ప్రాంతంలో 700 మీటర్ల మిగులు కరకట్ట పనులు పూర్తి కావాలంటే ఇంకా రు. 150 కోట్లు నిధులు అవసరం ఉంటుంది. రు. 38 కోట్లతో 2024 లో మిగులు కరకట్ట పనులు ప్రారంభించారు. కరకట్ట పనులు చాలా వరకూ పూర్తి అయినా.. జాతీయ రహదారిపై ఎలివేటెడ్ రోడ్డు నిర్మించాల్సి ఉండటంతో కరకట్ట పనులకు జాప్యం జరుగుతుంది. ఈ రోడ్డు నిర్మాణానికి రు. 150 కోట్లు వరకూ ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ నిధులు త్వరగా విడుదల అయితే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఎలివేటెడ్ రోడ్డు పూర్తి కావడానికి మరో రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ సుభాష్ నగర్ కాలనీతో పాటు మరికొన్ని కాలనీ ప్రజలకు వరద ముప్పు తప్పదు.






