- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగస్టు 30 వరకు ఓటర్ల ఎన్యూమరేషన్ గడువు పెంచాలి : సీపీఎం కార్యదర్శి జాన్వెస్లీ
రాష్ట్రంలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను ఆగస్టు 30 వరకు పొడిగించాలని ఎన్నికల కమిషన్‌ను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను ఆగస్టు 30 వరకు పొడిగించాలని ఎన్నికల కమిషన్‌ను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఎన్యూమరేషన్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో గందరగోళం ఉందని, ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలు కేవలం 30 శాతం మందికి కూడా చేరలేదని, ఇంకా 70 శాతం మందికి ఫారాలు అందాల్సి ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయని, దీంతో ప్రజలు ఈ ప్రక్రియపై దృష్టి సారించడం కష్టంగా మారింది. ఎన్యూమరేషన్ ప్రక్రియ పట్ల సామాన్య ప్రజల్లో సరైన అవగాహన లేదు. ఫారాలు నింపే విషయంలో ప్రజలు అనేక అనుమానాలకు, అపోహలకు లోనవుతున్నారు. కొంతమంది బీఎల్‌వోలు ఇంకా పూర్తిస్థాయిలో పనిలోకి దిగలేదని, ఓటర్ల అనుమానాలను నివృత్తి చేసే విషయంలో కొంత అవగాహన లోపం కనిపిస్తుందనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు వివరాలు నమోదు చేసి బీఎల్‌వోలకు అందజేయడానికి మరింత సమయం అవసరం అన్నారు. ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ వెంటనే గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.






