- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడిగడ్డతో గోదావరి తీరప్రాంతాలకు భారీ ముప్పు : కేటీఆర్ వ్యాఖ్యలపై సీతక్క ఫైర్
కాళేశ్వరం అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, భద్రతే తమ ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కాళేశ్వరంపై రాజకీయ డ్రామాలాడుతోందని దుయ్యబట్టారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో NDSA ఇచ్చిన నివేదికనే ప్రభుత్వం అనుసరిస్తోందని తెలిపారు. నిపుణుల అనుమతి లేనిదే నీటిని ఎత్తిపోయలేమని వెల్లడించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరంలో నిర్మాణ లోపాలు, అవినీతి కారణంగానే నేడు ఈ దుస్థితి తలెత్తిందని వాపోయారు. మేడిగడ్డలో ప్రమాదం జరిగితే గోదావరి పరివాహక ప్రాంత గ్రామాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో రైతులు నష్టపోతున్నారని హైలైట్ చేసి.. బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజల భద్రతలో ప్రభుత్వం ఎప్పటికీ ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. నిపుణుల కమిటీ ముందు వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు.






