- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సారా అక్రమ రవాణాపై ఎక్సైజ్ దాడి
హుజూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమంగా సారా తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు పట్టుకుని 8 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.

దిశ, హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమంగా సారా తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు పట్టుకుని 8 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హుజూర్‌నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు మండలం బెట్టే తండాకు చెందిన లావుడ్య నరేష్ తన బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్‌పై అక్రమంగా సారాను తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో, ఎక్సైజ్ ఎస్‌ఐ దివ్య ఆధ్వర్యంలో అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో నిందితుడి వద్ద నుంచి 8 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, తరలింపునకు ఉపయోగించిన బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్‌ను సీజ్ చేశారు. నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ దివ్య, ఎక్సైజ్ కానిస్టేబుల్ సుధాకర్, డ్రైవర్ నరేష్ పాల్గొన్నారు.






