65 వ జాతీయ రహదారి పై కంటైనర్ బీభత్సం

by Taduka Kalyani |

సదాశివపేట పట్టణ బైపాస్ 65 వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

65 వ జాతీయ రహదారి పై కంటైనర్ బీభత్సం
X

దిశ, సదాశివపేట: సదాశివపేట పట్టణ బైపాస్ 65 వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి వైపు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ అతి వేగంగా వచ్చి ఒక కారు, ఒక ట్రాక్టర్, ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్సు లో సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story