శివకార్తికేయన్ ‘సెయాన్’ సినిమాలో కన్నడ స్టార్.. పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

by Mallepaka Hamsa |

నేడు స్టార్ నటుడు రాజ్ బి శెట్టి పుట్టినరోజు కావడంతో.. ఆయనకు విషెస్ తెలుపుతూ.. పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు.

శివకార్తికేయన్ ‘సెయాన్’ సినిమాలో కన్నడ స్టార్.. పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సెయాన్’. ‘అమరన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్స్‌పై కమల్ హాసన్, ఆర్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ నటుడు జాయిన్ అయినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. నేడు స్టార్ నటుడు రాజ్ బి శెట్టి పుట్టినరోజు కావడంతో.. ఆయనకు విషెస్ తెలుపుతూ.. పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో రాజ్ బి శెట్టి సిగరెట్ తాగుతూ.. మంటల్లోంచి నడుచుకుంటూ వస్తున్న పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేసి అంచనాలను పెంచారు.

Next Story