- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్ గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టి వ్యక్తి అదృశ్యం
నేను వెళ్ళిపోతున్నాను... అని అంటూ వాట్సప్ గ్రూపులో వాయిస్ మెసేజ్ పెట్టి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సంచలనం లేపింది.

దిశ, నర్సాపూర్ : నేను వెళ్ళిపోతున్నాను... అని అంటూ వాట్సప్ గ్రూపులో వాయిస్ మెసేజ్ పెట్టి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సంచలనం లేపింది. ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణం సునీత లక్ష్మారెడ్డి కాలానికి చెందిన చిత్తారి నర్సింలు(34) తన భార్య చిత్తారి సుజాత శనివారం నాడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో సంసార విషయంలో అలాగే ఫోన్ రికార్డింగ్ విషయంలో గొడవ పడ్డారు. ఆదివారం నాడు ఉదయం 10 గంటల సమయంలో భార్యాభర్తలు ఇద్దరు నర్సాపూర్ పట్టణంలోని జీవజలముల చర్చి వైపు వెళ్లారు. అదే రోజు మధ్యాహ్నం సమయంలో చర్చి వద్దనే తన భార్యను వదిలిపెట్టి నర్సింలు వెళ్లిపోయాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:36 గంటలకు ఓ వాట్సప్ గ్రూపులో నర్సింలు నేను వెళ్ళిపోతున్నాను... అని అంటూ వాయిస్ రికార్డింగ్ పెట్టాడు. వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చూసిన కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. అలాగే అతని స్నేహితుల వద్ద వెతికిన జాడ తెలియరాలేదు. అతనికి ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. నర్సింలు ఆచూకీ తెలియకపోవడంతో కంగారుపడి అతని భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి వెల్లడించారు.






