స్వాతంత్య్ర వేడుకల వేళ.. న్యూయార్క్‌లో కాల్పుల కలకలం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-05 15:35:08  IST  )

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ న్యూయార్క్ లో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.

స్వాతంత్య్ర వేడుకల వేళ.. న్యూయార్క్‌లో కాల్పుల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. న్యూయార్క్ లో కాల్పులు కలకలం రేపాయి. అక్కడ ఫేమస్ అయిన కానో ఐలాండ్ బీచ్ సమీపంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన కుకౌట్ కార్యక్రమాల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో నలుగురు పిల్లలు ఉండగా.. 21 ఏళ్ల యువతి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారి పరిస్థితి స్థిరంగా ఉందని పోలీస్ కమిషనర్ జెస్సికా టిస్చ్ వెల్లడించారు. కానో ఐలాండ్ బోర్డ్ వాక్ కు కేవలం ఒక బ్లాక్ దూరంలో ఉన్న ఒక అపార్ట్ మెంట్ భవనం ప్రాంగణంలో శనివారం రాత్రి ఈ కాల్పుల కలకలం రేగింది. ముఖానికి బ్లాక్ మాస్క్ వేసుకున్న నిందితుడు.. ఓ కుటుంబం విందు చేస్తుండగా అక్కడికి వెళ్లి కాల్పులు జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం అతను పరారవ్వగా.. స్పాట్లో లభించిన తుపానికి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Next Story