పృథ్వీ షా పెళ్లి క్యాన్సిల్?.. అతనికి కాబోయే భార్య పోస్టు వైరల్

by Harish |

భారత క్రికెటర్ పృథ్వీ షా తన ప్రేయసి ఆకృతి అగార్వల్‌‌ను మార్చిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.

పృథ్వీ షా పెళ్లి క్యాన్సిల్?.. అతనికి కాబోయే భార్య పోస్టు వైరల్
X

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెటర్ పృథ్వీ షా తన ప్రేయసి ఆకృతి అగార్వల్‌‌ను మార్చిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆకృతి ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్టు పెట్టింది. ‘నేను ఎన్నో సార్లు మోసపోయాను.ఒక్కసారి కూడా ఒక్క మాట అనలేదు. ఒక్క అడుగు ముందుకు వేసిన తర్వాత కూడా ఇలా జరుగుతుందని నేను నమ్మలేకపోతున్నా. అంతా నిజమే. ప్రతి రూమర్ నిజమే. సోషల్ మీడియాలో అతని గురించి మీరు చూసేదంతే నిజమే’అని ఇన్‌స్టా స్టోరీ పెట్టింది. కాసేపటికే ఆమె ఆ పోస్టును డిలీట్ చేసినప్పటికీ అప్పటికే నెటిజన్లు స్క్రీన్‌షాట్స్‌ను వైరల్ చేశారు.

ఆ పోస్టులో ఆకృతి ఎవరి పేరును ప్రస్తావించలేదు. కానీ ఆమె చేసిన ఆరోపణలు కొత్త చర్చకు దారితీశాయి. పృథ్వీ షాను ఉద్దేశించే ఆకృతి పోస్టు పెట్టిందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. పృథ్వీ షా‌తో ఆకృతి తన పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకుందన్న పుకార్లు కూడా మొదలయ్యాయి. అయితే, షాగానీ, ఆకృతిగానీ దీనిపై ఇంకా స్పందించలేదు. వీరిద్దరూ ఇన్‌స్టాలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. అలాగే, ఎంగేజ్‌మెంట్ ఫొటోలు కూడా తొలగించలేదు. ఆకృతి నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఇక, షా కొంతకాలంగా క్రికెట్ కెరీర్‌ పరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఫిట్‌నెస్ లేమి, ఫామ్ లేని కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు.2021లో భారత్ తరపున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించగా అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.


Next Story