- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోరబండ ఎస్సై నాగుల్ మీరాపై సస్పెన్షన్ వేటు..
బోరబండ ఎస్సై షేక్ నాగుల్ మీరాపై నగర పోలీస్ కమిషనర్ శనివారం సస్పెన్షన్ వేటు వేశారు.

దిశ, జూబ్లీహిల్స్: బోరబండ ఎస్సై షేక్ నాగుల్ మీరాపై నగర పోలీస్ కమిషనర్ శనివారం సస్పెన్షన్ వేటు వేశారు. మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను వేధిస్తుండడంతో అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు.షేక్ నాగుల్ మీరా ఆర్టీసీ కండక్టర్ షేక్ రహేమాను 2019లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. బోరబండలో షేక్ నాగుల్ మీరా ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని భార్య ఈ మధ్య డిజిపి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఎస్సైతో పాటు మహిళా కానిస్టేబుల్‌ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. అయితే కౌన్సిలింగ్ తర్వాత కూడా తన భర్తలో మార్పు రాలేదని, ఫిర్యాదు చేశారనే కోపంతో భార్యను వేధింపులు శృతి మించడంతో మళ్లీ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లింది. పోలీస్ కమిషనర్ పూర్తిస్థాయిలో విచారణ చేయించారు. ఎస్సె షేక్ నాగుల్ మీరా భార్యను తీవ్రంగా వేధించడంతో పాటు మహిళలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా నిర్ధారించుకున్నారు. వెంటనే ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.






