ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా ప్రభుత్వం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-05 14:21:13  IST  )

ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు మంత్రి స్వయంగా అందజేశారు...

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా ప్రభుత్వం
X

దిశ, ధర్మవరం: ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు మంత్రి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన మొత్తం 37 మంది లబ్ధిదారులకు రూ.16,00,447 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు, అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రమాదాలు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఊరటనిస్తుందని మంత్రి పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య చికిత్సల కోసం అప్పుల పాలవకుండా వారికి ప్రభుత్వం అండగా నిలవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రజల సమస్యలను కేవలం వినడమే కాకుండా, వాటి పరిష్కారానికి వేగంగా స్పందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్సలకు దూరమవుతున్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఒక పెద్ద భరోసాగా నిలుస్తోందన్నారు. ధర్మవరం నియోజకవర్గం నుంచి వచ్చే ప్రతి అర్హమైన దరఖాస్తును ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా మంజూరు అయ్యేలా తన కార్యాలయం నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ప్రజలకు ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం నిజమైన లబ్ధిదారులకు చేరుకోవాలన్నదే తమ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారికి ప్రభుత్వ సహాయాన్ని అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అనంతరం అదే వేదికపై మంత్రి సత్యకుమార్ యాదవ్ జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనతా వారధి వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాం. ప్రజల విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి, సాధ్యమైనంత వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలకు సేవ చేయడమే మా రాజకీయాల లక్ష్యం. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాం అని పేర్కొన్నారు.

Next Story