- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాద్‌నగర్ ప్రధాన కూడలి విస్తరణకు సహకరించాలి
by Taduka Kalyani |
షాద్ నగర్ పట్టణ అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ప్రధాన కూడలి విస్తరణకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విజ్ఞప్తి చేశారు.

X
దిశ, షాద్ నగర్: షాద్ నగర్ పట్టణ అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ప్రధాన కూడలి విస్తరణకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చౌరస్తా విస్తరణతో పట్టణ ముఖచిత్రం మారుతుందన్నారు. ఈ అంశంపై త్వరలో అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సూచనలు, సహకారంతోనే ముఖ్య కూడలి విస్తరణ పనులు చేపడతామని, ఎలాంటి అపోహలకు తావు లేదని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు.
Next Story






