- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ బాబర్‌నే నమ్ముకున్న పాక్ బోర్డు.. టెస్టు జట్టు కెప్టెన్‌గా నియామకం
పాకిస్తాన్ టెస్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్‌కే దక్కాయి.

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ టెస్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్‌కే దక్కాయి. ఇప్పటివరకు టెస్టు కెప్టెన్‌గా ఉన్న షాన్ మసూద్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వేటు వేసింది. అతన్ని తప్పించి బాబర్‌ను సారథిగా నియమించింది. ఆదివారం పీసీబీ వెస్టిండీస్, ఇంగ్లాండ్ టూరులు తమ టెస్టు జట్లను ప్రకటించింది. మసూద్ నాయకత్వంలో పాక్ టెస్టుల్లో ఘోరంగా విఫలమైంది. 16 టెస్టుల్లో కేవలం నాలుగింట మాత్రమే పాక్ విజయాలు సాధించింది. 12 మ్యాచ్‌ల్లో ఓడింది. బంగ్లాదేశ్ చేతిలో రెండుసార్లు వైట్‌వాష్ కావడం గమనార్హం. కెప్టెన్‌గా విఫలమైన కారణంగానే పీసీబీ మసూద్‌ను కెప్టెన్‌గా తప్పించినట్టు అర్థమవుతుంది. అలాగే, పీసీబీ మళ్లీ బాబర్‌నే నమ్ముకుంది. 2021-23 మధ్య అతను పాక్ టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, కొంతకాలంగా బాబర్ పెద్దగా ఫామ్‌లో లేడు. వెస్టిండీస్, ఇంగ్లాండ్ పర్యటనకు ప్రకటించిన జట్లలో పాక్ బోర్డు నలుగురు కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చింది. బ్యాటర్లు మహ్మద్ అవైస్ జాఫర్, మహ్మద్ ఘథాజీ ఘోరీ, స్పిన్నర్ అలీ ఉస్మాన్, ఫాస్ట్ బౌలర్ ఉబైద్ షా తొలిసారిగా టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెలాఖరులో పాక్ జట్టు విండీస్‌కు వెళ్లనుండగా.. అక్కడ రెండు టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టులో ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది.






