ఒకటి కూల్చితే వంద సంస్థలు కడతాం.. ఫాతిమా కాలేజీ అంశంపై అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని కాలేజీ అనుమతులపై కోర్టు గడువు విధించిన తరుణంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఒకటి కూల్చితే వంద సంస్థలు కడతాం.. ఫాతిమా కాలేజీ అంశంపై అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫాతిమా కాలేజీ అంశంపై చాంద్రయణగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. మా విద్యాసంస్థలను కూల్చివేస్తామని అంటున్నారని ఒక సంస్థను కూల్చేస్తే వందల విద్యా సంస్థలు కడతామన్నారు. విద్యాసంస్థలను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసన్నారు. మమ్మల్నీ భయపెట్టాలని చూస్తున్నారని ఇలాంటి బెదిరింపులు గతంలో చాలానే చూశామన్నారు. మీ బెదిరింపులకు మేం లొంగం అని హెచ్చరించారు. మేం అవినీతికి పాల్పడలేదని ఎలాంటి మోసాలు చేయలేదన్నారు. మా విద్యాసంస్థలు ఉన్నా లేకపోయినా విద్యార్థులకు చదువు చెప్పిస్తామన్నారు.

వారం రోజులు గడువు విధించిన హైకోర్టు:

కాగా చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కాపాడటమే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా.. ఒవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా కాలేజీ సల్కం చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించారని దీన్ని తొలగిస్తామని గతంలో ప్రకటించింది. అయితే అక్కడ ఎలాంటి కూల్చివేతలు జరపకపోవడంతో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. పేదల కోసం పని చేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని ప్రకటించారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పాతిమా విద్యాసంస్థల విషయంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ హైకోర్టుకు కీలక వివరణ ఇచ్చింది. హైదరాబాద్‌ జిల్లా బండ్లగూడ మండలం బండ్లగూడ విలేజ్‌ సర్వే నెంబర్‌ 62లోని సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌లో కట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థకు ఎలాంటి అనుమతి లేదని పాఠశాల విద్యాశాఖ హైకోర్టుకు వెల్లడించింది. ఈ క్రమంలో భవన అనుమతులు, ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ తదితర అంశాలపై వారం రోజుల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆయా శాఖలను ఆదేశించింది. లేనిపక్షంలో ఈనెల 9వ తేదీ వరకు అందుబాటులో ఉన్న సమాచారంతోనే ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో అక్బరుద్దీన్ ఒవైసీ పై వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది.

Next Story