- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో వరుస నేరాలు.. రౌడీ షీటర్‌పై పీడీ యాక్ట్ అమలు
తిరుమలలో భక్తుల భద్రత, ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ వరుసగా నేరాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్ జి. శ్రీనివాసులు 20పై ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్, 1986 ప్రకారం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ..

దిశ, తిరుపతి ప్రతినిధి: తిరుమలలో భక్తుల భద్రత, ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ వరుసగా నేరాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్ జి. శ్రీనివాసులు 20పై ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్, 1986 ప్రకారం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ప్రతిపాదన మేరకు, తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ డా. ఎస్. వెంకటేశ్వర్ పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు తిరుమల ప్రాంతంలో దొంగతనాలు, దాడులు, ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై దౌర్జన్యాలు, మహిళలపై వేధింపులు, ఆయుధాలతో బెదిరింపులు, ప్రజల్లో భయాందోళనలు సృష్టించే చర్యలకు పాల్పడుతూ గత ఏడాది కాలంలో మొత్తం ఐదు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పలుమార్లు అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ, అతని నేర ప్రవృత్తిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో, ప్రజా శాంతి భద్రతలకు ముప్పుగా మారినట్లు జిల్లా పోలీసు శాఖ నిర్ధారించింది.దీంతో జిల్లా కలెక్టర్ జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వుల మేరకు నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు






