- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సజ్జల రాజకీయంపై ఎంపీ లావు సంచలన వ్యాఖ్యలు
వైసీపీలో అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తే సర్ ప్రక్రియ ఆలస్యానికి కారణమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. ...

దిశ, మాచర్ల: వైసీపీలో అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తే సర్ ప్రక్రియ ఆలస్యానికి కారణమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. ఆదివారం కెసిపి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ లావు, ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడారు. ప్యాలెస్‌లోని ఏసీ గదుల్లో కూర్చొని సర్ పోగ్రాంపై కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.
వైసీపీలో ఉన్న అంతర్గత అసంతృప్తుల కారణంగానే ఆ పార్టీ క్యాడర్ సర్ ప్రోగ్రామ్‌కు దూరంగా ఉంటున్నారని, అందుకే మందకొండగా కార్యక్రమం సాగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దొంగే తన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఫిర్యాదు చేసినట్లుగా సజ్జల రాజకీయం ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్య భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే సర్ కార్యక్రమంపై వైసీపీ చేస్తున్న నిర్లక్ష్య వైఖరి క్షమించరానిది అని మండిపడ్డారు. కూటమి పార్టీల శ్రేణులు ఎంతో నిబద్ధతగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్నారన్నారు.
ఏదైనా ఆధారాలు చూపి విమర్శలు చేస్తే దాన్ని సరి చేసుకోవడానికి కూటమి పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, అంతేగానీ కేవలం రాజకీయ రాద్ధాంతం కోసం లేనిపోని ఆరోపణలు చేయడం వైసీపీకి తగదని హితవు పలికారు. అధికారులకు, బిఎల్వోలకు కూటమి పార్టీల శ్రేణులు పూర్తిస్థాయిలో సహకరిస్తూ ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.






