ఫ్లాట్‌కు రోజుకో మాంసం బాక్స్.. సోదాల్లో ఊహించని ట్విస్ట్

by Vemula.Srinu Prasad |

వన్యప్రాణులను అక్రమంగా ఇళ్లలో పెంచకూడదు. వేట పూర్తిగా నిషేధం. అయినా ఓ యువకుడు ఈ చట్టాలను పట్టించుకులేదు. ఎంచక్కా కొండచిలువను తెచ్చుకుని గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో పెంచుకుంటున్నారు. ...

ఫ్లాట్‌కు రోజుకో మాంసం బాక్స్.. సోదాల్లో ఊహించని ట్విస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: వన్యప్రాణులను అక్రమంగా ఇళ్లలో పెంచకూడదు. వేట పూర్తిగా నిషేధం. అయినా ఓ యువకుడు ఈ చట్టాలను పట్టించుకులేదు. ఎంచక్కా కొండచిలువను తెచ్చుకుని గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో పెంచుకుంటున్నారు. కానీ గుట్టురట్టు కావడంతో జైలు పాలయ్యాడు. ఈ వింత ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. కామాక్షిపాళ్య పరిధిలోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు నివాసం ఉంటున్నారు. అయితే అతను ఎవరికీ తెలియకుండా తన ఫ్లాట్‌లో కొండచిలువను పెంచుకుంటున్నారు. విషయం బయటకు తెలియడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఫ్లాట్‌కు పెద్ద ఎత్తున మాంసం బాక్సులు

కొంతకాలంగా ఫ్లాట్‌కు పెద్ద ఎత్తున మాంసం బాక్సులు వస్తున్నాయి. అంతేకాదు యువకుడి కదలికలు కూడా అనుమానాస్పదంగా ఉండటాన్ని కాలనీ వాసులు గమనించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు యువకుడి ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాచి ఉంచిన కొండచిలువను చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. యువకుడిని అరెస్ట్ చేశారు. ఆ కొండచిలువను స్వాధీనం చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Next Story